National
భూపాలపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి

Date 2/09/2026
భూపాలపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్
జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మైసమ్మ కాలనీలో గృహప్రవేశ కార్యక్రమం
భూపాలపల్లి పట్టణంలోని మైసమ్మ కాలనీలో సుమన్, అరుణ గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రవి పటేల్ హాజరై, కుటుంబ సభ్యులను అభినందించి నూతన గృహంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కొండమళ్ల రవి కుటుంబాన్ని పరామర్శించిన రవి పటేల్
రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొండమళ్ల రవి ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను రవి పటేల్ పరామర్శించారు. దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని మృతునికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం రూపిరెడ్డిపల్లి గ్రామంలో పలువురు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కలుపుకొని సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. పార్టీ విధానాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించగా, పలువురు త్వరలో పార్టీలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
రాజీవ్‌నగర్ కాలనీలో సంవత్సరిక కార్యక్రమానికి హాజరు
రాజీవ్‌నగర్ కాలనీ వాసి ముండ్రాతి రాంభాయ్ గారి సంవత్సరిక కార్యక్రమానికి రవి పటేల్ హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరామర్శ
భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రవి పటేల్, చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
కార్లమాస్ కాలనీకి చెందిన పందిళ్ల శంకర్ శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతుండగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎల్బీనగర్‌కు చెందిన దుడ్డెల నరేష్ నిన్న ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోవడంతో చేతికి ఫ్రాక్చర్‌తో పాటు గాయాలు కాగా, ఆసుపత్రిలో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే మొరంచపల్లి, పొనగల్లు, పుల్లురామయ్యపల్లి, జూకల్లు, చల్లగరిగె గ్రామాలకు చెందిన పలువురు రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలని, రోగులను గౌరవంగా చూసుకోవాలని, వైద్యులు సమయానికి విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రవి పటేల్ కోరారు. రోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు పిట్టల వెంకటేష్, మడే సంతోష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.