🔥 TRENDING महाअष्टमी पर गोरखनाथ मंदिर में विशेष अ... JTSA questions Manipur government's tr... Manipur Violence: One Killed as Clashe... Meghalaya: BLO Removed for Incorrectly... Meghalaya maps 3.4 lakh hectares of cu... Amritsar Police Nab Four Men with 1.05...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

IPS అధికారుల శిక్షణ పూర్తి.

✍️ Reporter: Thalapally Kranti Kumar 🗓 19 Oct 2026, 10:02 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో 78వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ ఐపీఎస్ (IPS) అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్) వైభవంగా జరిగింది.
ఈ బ్యాచ్‌లో మొత్తం 151 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 135 మంది భారతీయ ఐపీఎస్ ప్రొబేషనర్లు కాగా, 16 మంది పొరుగు దేశాలకు చెందిన విదేశీ అధికారులు ఉన్నారు.
• ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరై, గౌరవ వందనం స్వీకరించారు .
శిక్షణ పూర్తి చేసుకున్న ఈ యువ అధికారులు ఇకపై తమకు కేటాయించిన రాష్ట్ర క్యాడర్లలో 29 వారాల పాటు క్షేత్రస్థాయి (డిస్ట్రిక్ట్ ఫీల్డ్) శిక్షణను ప్రారంభించనున్నారు.
📲Get App