🔥 TRENDING बोटाद में महिला सुरक्षा के लिए 181 अभय... CDSCO Orders Halt to Uttarakhand Pharm... Uttarakhand Boosts Dearness Allowance... Delhi Enforces GRAP 3 Vehicle Restrict... Delhi's air quality plummets to near‑s... Six dead as illegal Delhi building col...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గుత్పల గ్రామంలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. BRSలోకి 50 మంది చేరిక!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 08 Nov 2026, 11:17 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్న నాయకులు, కార్యకర్తలు
గుత్పల గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ పెండూర్ లక్ష్మీబాయి భీంరావు (భూమన్న), మాజీ సర్పంచ్ గసకంటి రవి, వార్డు సభ్యులు CH రవి, G. రవితో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్‌లో చేరినట్లు వారు తెలిపారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
📲Get App