🔥 TRENDING West Bengal to Waive Govt Job Exam Fee... West Bengal Theaters Serve Only Vegeta... Patna-Varanasi Bullet Train to Cover D... Railways Runs Special Trains and Holdi... ਪਹਿਲਾਂ ਹੱਥ 'ਚ ਫੜਾਏ ਪੈਸੇ, ਫ਼ਿਰ ਵੀਡੀਓ ਬਣ... Severe Fire Ravages Timber Market Shop...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

97 మంది లబ్ధిదారులకు రూ.20.44 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 18 Nov 2026, 12:07 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నేరడిగొండ: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో బోత్ నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల 44 వేల విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
📲Get App