🔥 ट्रेंडिंग ब्लिंकेन ने कहा, यू.एस. को भारत के आत्... एआई बूम: विजेता और हारे हुए का संतुलन,... वीडियो में दिखा अमेरिकी पार्क में भारत... वायरल वीडियो में महिला ने ट्रेन वॉशरूम... उदयपुर टनल में कार रोक कर आतिशबाज़ी कर... జీకే వీధి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థ...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మారుమూల గిరిజన గ్రామం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు.. చిన్నబాబుకు అరుదైన అవకాశం! 92.4 శాతం మార్కులతో ప్రతిభ చాటిన ఏకలవ్య విద్యార్థి.. జనజాతీయ గౌరవ దివస్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 15 नव. 2026, 07:26 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన మెట్టపాటి చిన్నబాబు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం అందింది. మారుమూల గిరిజన గ్రామానికి చెందిన విద్యార్థికి ఈ అరుదైన అవకాశం లభించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.జీకే వీధి మండలం వంచుల పంచాయతీ కొత్తపాలెం గ్రామానికి చెందిన స్వర్గీయ బుజ్జిబాబు, పార్వతమ్మ దంపతుల కుమారుడైన చిన్నబాబు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించారు. హ్యూమానిటీస్ విభాగంలో 92.4 శాతం మార్కులు సాధించి తన విద్యా ప్రతిభను నిరూపించుకున్నారు.చిన్నబాబు సాధించిన ఈ ఘనత గిరిజన విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. పట్టుదల, కృషితో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన నిరూపించారని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా రమణ మాస్టారు, ముర్ల భూపతి, కొత్తపాలెం గ్రామస్థులు చిన్నబాబును అభినందించారు. ఆయనకు సహకరించిన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
📲Get App