🔥 ट्रेंडिंग अन्ड्रे के अविनाशी फिफ्टी से तमिलनाडु... डीवीएसी ने के.एन. नेहरू के 634 करोड़ न... कैबिनेट ने दिवाली से पहले केंद्र सरकार... ਪੰਜਾਬ : ਠੰਡ ਦੇ ਮੱਦੇਨਜ਼ਰ ਸਕੂਲਾਂ ਦਾ ਬਦਲਿ... जालंधर‑लुधियाना हाईवे पर ऑटो‑ट्रक टकरा... .ज्येष्ठ पत्रकार आणि राजकीय विश्लेषक प...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🔥🪭 *6వ వార్డులో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు.. జయశ్రీ గారి గెలుపే లక్ష్యం! 🪭*🔥

✍️ रिपोर्टर: BOYA RAJU 🗓 29 अक्टू. 2026, 02:13 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, రాష్ట్ర SEC సభ్యులు శ్రీ బనవాసి బసి రెడ్డి గారు 6వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి జయశ్రీ గారిని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కె.ఎస్. రఘు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

🔥 *జగన్ అన్న సంక్షేమ పాలనను గుర్తుచేస్తూ.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ-- ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి గారు ప్రచారం!*

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, ఆసరా వంటి సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు అందించిన సహాయాన్ని ప్రజలకు వివరించారు. విద్యార్థుల చదువులు, రైతుల సంక్షేమం, మహిళల ఆర్థిక సాధికారతకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేశారు.

మరోవైపు, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు ఏమైందని, పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారని నాయకులు ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం పాలకుల బాధ్యత అని స్పష్టం చేశారు.

🪭 *జయశ్రీ గారి గెలుపు కోసం బనవాసి బసి రెడ్డి గారి ప్రచారం!*

రాష్ట్ర SEC సభ్యులు బనవాసి బసి రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయశ్రీ గారికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని, జయశ్రీ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

🔥 *ప్రజల ఆశలు నెరవేర్చే పాలన కోసం.. 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం!*

🪭 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయశ్రీ గారికి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కె.ఎస్. రఘు గారికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిచలిని
📲Get App