🔥 TRENDING ਅਕਾਲੀ-ਭਾਜਪਾ ਦੇ ਗਠਜੋੜ ਦਾ ਐਲਾਨ, ਮਿਲ ਕੇ ਲ... ਗੱਠਜੋੜ ਦੇ ਐਲਾਨ ਮੌਕੇ ਬੋਲੇ ਸੁਖਬੀਰ ਬਾਦਲ-... घातक टक्कर: गाड़ी ने घज़ियाबाद के NH 2... Supreme Court records judgment in Uman... Madhya Pradesh High Court Summons Kanh... Police seize 17,390 bottles of illegal...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎంపీడీఓ రమణబాబు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 04:52 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుందని ఎంపీడీఓ రమణబాబు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత ప్రచారానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు అధికారులకు సహకరించాలని ఎంపీడీఓ రమణబాబు కోరారు.
📲Get App