కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బుట్నా లక్ష్మి, 32 వార్డులకు కౌన్సిలర్లు నామినేషన్
यहाँ देखें:
▶️ YouTube
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో చైర్పర్సన్ అభ్యర్థిగా బుట్నా లక్ష్మి తిమ్మరాజు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మున్సిపాలిటీలోని 32 వార్డులకు టిడిపి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక నుండి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో అట్టహాసంగా ఊరేగింపు నిర్వహిస్తూ మున్సిపల్ కార్యాలయం చేరుకొని నామినేషన్లు వేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.