సిరికొండ మండలంలో 205 మందికి ఆసరా పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
సిరికొండ: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 205 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్‌తో కలిసి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.