మహిళా సంఘాల బలోపేతానికి పెద్దపీట.. రూ.20 లక్షలతో భవనాల నిర్మాణం
సాత్ నంబర్, ఇస్లాం నగర్ గ్రామాల్లో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని సాత్ నంబర్, ఇస్లాం నగర్ గ్రామాల్లో రూ.20 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రత్యేక భవనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతోపాటు, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.