खेल
ఇండియా మరియు జింబాబ్వే వుమెన్ మొదటి టీ 20 లో విజయం సాధించిన భారత జట్టు.
రాయిపూర్ వేదికగా జరిగిన భారత్ మహిళలు మరియు జింబాబ్వే మహిళల మధ్య జరిగిన మొదటి T20 క్రికెట్ మ్యాచ్-లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగా బ్యాటింగ్-కి దిగిన భారత్ రెండవ ఓవర్ లోనే కెప్టెన్ స్మృతి మందాన వికెట్ కోల్పోగా తర్వాత త్వర త్వరగానే కేవలం 3.1 ఓవర్ల లోనే వరుసగా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది.తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దీప్తి శర్మ 49 పరుగులు చేయగా,నిక్కి ప్రసాద్ 39పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ని కేవలం 15.4 ఓవర్ల లోనే విజయ తీరాలకు చేర్చారు. రెండవ టీ 20 ఈ నెల 18 న జరగనుంది.