🔥 TRENDING ઘરફોડ ચોરીના ગુનામાં અઢી વર્ષથી નાસતા... ഇടിമിന്നൽ ജാഗ്രതാ നിർദേശം Cash and Ring Stolen from Thar on Bhop... Shooting at Bhind District Hospital Sp... Umarria Woman Assaulted, Jewelry and C... हनुमानगढ़ में विजयादशमी पर राष्ट्रीय स...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

2వ T 20-లో భారత్ విజయం.

✍️ Reporter: T Kranthi Kumar 🗓 25 Oct 2026, 03:25 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. శనివారం (అక్టోబర్ 24, 2026) క్రిస్ట్‌చర్చ్‌ లోని హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ ఉత్కంఠ భరిత పోరులో గెలుపొందడం ద్వారా 5 మ్యాచ్‌ ల సిరీస్‌ లో టీమిండియా 2-0 ఆధిక్యం లోకి దూసుకెళ్లింది.

టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన
న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ టీం లో గ్లెన్ ఫిలిప్స్ 70, బెవాన్ జాకబ్స్ 58 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్
19.5 ఓవర్లలో మ్యాచ్ గెలిచింది . మొదట భారత్ 70 పరుగుల కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన 'తెలుగు బ్రదర్స్' తిలక్ వర్మ మరియు నితీష్ అద్భుత ప్రదర్శన తో మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్ విజయంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువ క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో సెన్సేషన్‌ గా మారారు.
తిలక్ వర్మ: 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 51 పరుగులు చేయగా నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచారు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.
ఈ సిరీస్‌ లో తదుపరి మూడో టీ 20 మ్యాచ్ అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌ లో జరగనుంది
📲Get App