🔥 TRENDING સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના નિવેદ... ग्राम दरबारा में तालाब के दूषित पानी स... Police Recover 20 Two-Wheelers in Arun... पैडल रिक्शा चालक की बेबसी: 20 रुपये की... Rajouri Youth Faces 18‑Month Wait Afte... फारबिसगंज‑जोगबनी मार्ग पर गड्ढे और गट्...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొత్తపాలెం 2 ఎంపీటీసీ బరిలో రెబల్ అభ్యర్థి గోపినాయక త్రినాథ్ రావు బీరువా గుర్తు కేటాయింపు.. బ్యాలెట్ నమూనా విడుదల

✍️ Reporter: Reporter RAJU 🗓 31 Oct 2026, 07:36 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని కొత్తపాలెం సెగ్మెంట్ 2 ఎంపీటీసీ స్థానానికి రెబల్ అభ్యర్థిగా గోపినాయక త్రినాథ్ రావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయనకు బీరువా గుర్తు కేటాయించడంతో పాటు బ్యాలెట్ నమూనా విడుదలైంది. ఈ సందర్భంగా అభ్యర్థి గోపినాయక త్రినాథ్ రావు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. "నేను కాదు.. మన గ్రామం.. మన గ్రామ అభివృద్ధి కోసం మీ ఓటు కీలకం" అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.కొత్తపాలెం సెగ్మెంట్ 2 ఓటర్లు ఎన్నికల్లో తనకు కేటాయించిన బీరువా గుర్తును గుర్తించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
📲Get App