🔥 TRENDING Man dies after slipping under moving t... Jalandhar Police to Make Restaurants a... Delhi businessman kidnapped; suspect a... Four Family Members Die in Muraina Bik... Dungarpur Municipal Council: BJP Major... अगले 3 घंटों में मौसम बिगड़ने की संभाव...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*దళిత పేద రైతులతో మైదుకూరు మండలం జీవి.సత్రంలో రైతు సేవాసమితి 17వ రోజు రైతుగ్రామబాట*

✍️ Reporter: Ramesh K 🗓 17 Sep 2026, 07:00 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కడప జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కేసీ.కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు రైతులసాగునీటి సమస్య పైన, ప్రజల తాగునీటి సమస్య పైన పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సమస్యల పైన ఈనెల సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతుసేవా సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ప్రజలు, రైతులతో కలిసి జిల్లాలో ప్రతిరోజు గ్రామాలలో తిరుగుతూ తెలుసుకున్న సమస్యలను పరిష్కరించాలని ఆయా మండల రెవెన్యూ కార్యాలయాలదగ్గర నిరసనలు తెలియజేసి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం కూడా మండల రెవెన్యూ అధికారులకు అందజేస్తూ నిర్వహిస్తున్న రైతు సేవాసమితి రైతుగ్రామబాట కార్యక్రమం ఈరోజు17వ రోజు కార్యక్రమం రైతు సేవా సమితి మైదుకూరు మండలశాఖ అధ్యక్షుడు కుర్రాకు ఎల్లయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి మైదుకూరు మండలం జీవి. సత్రంలో దళిత పేద రైతుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత రైతుల ద్వారా రైతు నాయకులు తెలుసుకున్నది ఏమంటే రాష్ట్రాన్ని పాలించేందుకు ఏపాలకుడొచ్చినా దళితులకు ఇచ్చేపథకాలు పూర్తిస్థాయి అమలు కావడం లేదని పేదలకు ఇచ్చిన భూముల విషయమైతే అసైన్మెంట్ కమిటీలలో ఆర్భాటానికి దళితులకు భూములు ఇచ్చిన మని ప్రచారం చేసుకోవడం తప్ప పట్టాలు ఇచ్చేందుకు సంవత్సరాలు , ఇచ్చిన పట్టాలకు ఆన్లైన్ ఎక్కించి పాస్ బుక్కులు అందజేసేందుకు సంవత్సరాలు ఇచ్చిన వాటిలో సక్రమంగా ఒకటి ఉండి ఒకటి లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడం కొన్ని సంవత్సరాలు జరుగుతూ దళిత రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతులు రైతు నాయకులకు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం ఎలినానో ప్రభావంతో వర్షాలు లేక రైతుల పంటలు లేక పోవడంతో దళిత వ్యవసాయ కూలీలకు కూలి పనులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని దళితులు తెలియజేశారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో దళిత రైతులు ఎర్రన్న, చిన్నోడు, ప్రభుదాసు, బాలుడు తదితర దళిత రైతులు రైతు కూలీలు పాల్గొన్నారు.
📲Get App