🔥 ट्रेंडिंग সপ্তগ্রম বিধানসভার 13 নম্বর ওয়ার্ড এর... बोकारो के चुट्टे गांव में दुर्गा पूजा... দুর্গা পূজা সমাপ্ত, পেনডেল গুলি ফাঁকা... शराब के नशे में दबंगों ने बुजुर्ग और उ... बालाघाट: मंत्री प्रहलाद सिंह पटेल ने ग... 22 अक्टूबर 2026 को झुमरी तिलैया नगर पर...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఏపీ పింఛన్‌దారులకు నవంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు!

✍️ रिपोर्टर: పి రాజేష్ కుమార్ 🗓 22 अक्टू. 2026, 05:48 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

కేంద్ర ప్రభుత్వ వాటా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో DBT ద్వారా జమ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో నవంబర్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. పింఛన్ మొత్తంలో ఎలాంటి కోత ఉండదు, పూర్తి మొత్తం యథావిధిగా అందుతుంది.
కేంద్ర ప్రభుత్వ వాటా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో DBT ద్వారా జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు. కేటగిరీల వారీగా వాటా వివరాలు వృద్ధులు & ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000) కేంద్రం వాటా ₹200 (బ్యాంక్ ఖాతాలో) + రాష్ట్ర వాటా ₹3,800 (చేతికి నగదు),దివ్యాంగులు (మొత్తం ₹6,000) కేంద్రం వాటా ₹300 (బ్యాంక్ ఖాతాలో) + రాష్ట్ర వాటా ₹5,700 (చేతికి నగదు), ముఖ్య గమనిక కేంద్ర వాటా నిధులు ఖాతాలో పడాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ (NPCI Mapping) తప్పనిసరి.
📲Get App