🔥 TRENDING नमो नमो क्रांति फाउंडेशन में संगठन विस... దీనమణి విజయానికి కూటమి శ్రేణుల బలప్రదర... શિહોરી-દિયોદર રોડ પર અલ્ટો-એક્ટિવા ટક્... గాలికొండ అభివృద్ధికి నాగమ్మకు అవకాశం ఇ... औरंगाबाद पुलिस ने रोको टोको अभियानके त... Kerala Court Grants Bail to Sri Lankan...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎంపీడీఓ రమణబాబు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 09:36 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు నిర్లక్ష్యం వీడి ప్రజాస్వామ్య బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గూడెంకొత్తవీధి ఎంపీడీఓ రమణబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 26న నిర్వహించనున్న పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఓటర్లు అధికారులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని, ప్రతి ఓటు ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడుతుందని రమణబాబు పేర్కొన్నారు. మండలంలో అధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
📲Get App