🔥 TRENDING దీనమణి విజయానికి కూటమి శ్రేణుల బలప్రదర... શિહોરી-દિયોદર રોડ પર અલ્ટો-એક્ટિવા ટક્... గాలికొండ అభివృద్ధికి నాగమ్మకు అవకాశం ఇ... औरंगाबाद पुलिस ने रोको टोको अभियानके त... Kerala Court Grants Bail to Sri Lankan... Kerala HC: Police cannot deny convict...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొర్ర బాబి గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రచార వేగం కొత్త వెదురుపల్లి, ఆర్.వి. నగర్‌లో విస్తృతంగా ఓట్ల అభ్యర్థన

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 09:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం కొత్త వెదురుపల్లి, ఆర్.వి. నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి, సెగ్మెంట్-3 ఎంపీటీసీ బొబ్బిలి లక్ష్మణ్ మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి కొర్ర బాబితో పాటు 12వ వార్డు అభ్యర్థి కర్రీ రమాదేవి, 13వ వార్డు అభ్యర్థి కొర్ర చిన్నమ్మిలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొర్ర రాజులమ్మ, మాజీ వార్డు సభ్యుడు అంజి, నాయకులు రాజారావు, నీలకంఠం, శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.
📲Get App