🔥 TRENDING હિંમતનગરમાં કડવા પાટીદાર સમાજનું સંયુક... ਸਾਬਕਾ ਸਰਪੰਚ ਸਤਪਾਲ ਸਿੰਘ ਲਾਡੀ ਜੌਹਲ ਨੂੰ ਸ... धामोनी में बिजली से परेशान किसानों ने... अवैध पोस्ता की खेती छोड़ सब्जी उत्पादन... ಬ್ರಿಮ್ಸ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಔಷಧ ಕೊರತೆ: ಒಂದು... India and New Zealand End Hockey Match...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దొడ్డి కొండలో కాసులమ్మకు మద్దతుగా వైసీపీ ప్రచారం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 22 Nov 2026, 09:13 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
దామనపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి కాసులమ్మ ఆదివారం దొడ్డి కొండ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా కాసులమ్మ మాట్లాడుతూ పంచాయతీలోని గ్రామాలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో వంతల చంటిబాబు, కొర్రా గోవిందరావు, కొర్రా విక్టర్ బాబు, పాంగి సుబ్బారావు, జూర్రా రమణబాబు, చెదల చిట్టిబాబు, వంతల రాజ్‌కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App