🔥 ट्रेंडिंग કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સ... मणिपुर में होच दुर्घटना: मौतों की संख्... बैंक अवकाश के कारण सोमवार को बैंक बंद पाकिस्तान ने यूएन ई‑गवर्नमेंट डेवलपमें... 23 नवम्बर 2026 को मेघालय में सोने की क... સુરતમાં ક્રાઇમ બ્રાંચે લક્ષ્મણ (ગુડુ)...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రత్నపూర్ గ్రామానికి త్వరలోనే బీటీ రోడ్డు..ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 नव. 2026, 11:45 AM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గ్రామస్తులకు భగీరథ నీరు అందేలా అధికారులకు ఆదేశాలు
తలమడుగు మండలంలోని మారుమూల గుట్టపై ఉన్న గిరిజన గ్రామం రత్నపూర్ రోడ్డును సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గత 15 రోజులుగా భగీరథ నీరు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మంగళవారం నుంచే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ హయాంలో మారుమూల గుట్టపై ఉన్న రత్నపూర్ గ్రామానికి సైతం భగీరథ నీరు అందించడంతో పాటు గ్రామస్తుల రవాణా సౌకర్యార్థం రూ.4 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైందని తెలిపారు. త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయించి గ్రామస్తులకు బీటీ రోడ్డు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App