అర్జునీ—మారుగూడ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వినతి
గాదిగూడ మండలం అర్జునీ-మారుగూడ గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని TAGS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోయి విద్యార్థులు, రైతులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జిల్లా అధ్యక్షుడు కుమ్రా బీంరావ్ కోరారు.