బోథ్: బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: సత్యనారాయణ
బోథ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జీవిత బీమా పథక దరఖాస్తు ప్రక్రియను మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ పరిశీలించారు. పథకంపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.