🔥 TRENDING Mexican Drug Lord's Arrest Triggers De... Two Dead in Gumla Road Accident Prakasam Ministers Mourn Road Accident... Family Receives Rs 10.20 Lakh After SB... Modi Highlights Bihar's Development, D... Indian Couple Fatally Shot Outside Can...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పెద్దవంగర మండలం లో కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 22 Nov 2026, 06:28 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం లో

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దవంగర మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ్ర జైపాల్ (35)కు విజయవాడకు చెందిన లక్ష్మితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పది రోజుల క్రితం లక్ష్మి తన పుట్టింటికి విజయవాడ వెళ్లిపోయింది. అప్పటి నుంచి జైపాల్ తీవ్ర మనస్తాపానికి గురై సరిగా ఆహారం తీసుకోకుండా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేచి చూడగా ఇంట్లో ఫ్యాన్ ఇనుప కొండికి లుంగీతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి కొండ్ర ధనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై ఎవరిపైనా అనుమానం లేదని పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రమోద్ కుమార్ తెలిపారు.
📲Get App