ధాబా (బి)లో ఘనంగా కాకడ హారతి – తులసి కళ్యాణం
ఇచ్చోడ: మండలంలోని ధాబా (బి) గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో కాకడ హారతి, తులసి కళ్యాణం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాకడ హారతి సమర్పించారు.
అనంతరం భక్తులు ప్రభాతభేరి నిర్వహిస్తూ గ్రామంలో ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నారాయణ స్వగృహంలో తులసి, ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా తులసి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.