దామనపల్లిలో కాసులమ్మకు మద్దతుగా చంటిబాబు ప్రచారం నల్లబెల్లి ఓటర్లను కలిసి అభ్యర్థికి ఓటేయాలని విజ్ఞప్తి
Watch on:
▶️ YouTube
దామనపల్లి పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంతల కాసులమ్మ తరఫున ఆమె భర్త, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబు నల్లబెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం గ్రామంలోని ఓటర్లను కలిసి కాసులమ్మకు అవకాశం కల్పించాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చంటిబాబు తెలిపారు. ప్రజలతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. కాసులమ్మను గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.