🔥 ट्रेंडिंग Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... अमेरिकी कंपनियों ने भारत में डिज़ाइन व... अहमदाबाद में तीसरा ऑल इंडिया पुलिस बैड... कर्नाटक बनाम झारखंड: 20 नवंबर 2026 का...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్: ఖరీఫ్ పంట దిగుబడులు, పత్తి కొనుగోళ్లు పై సమీక్ష సమావేశం

✍️ रिपोर्टर: Pothula Gandhi Babu 🗓 19 नव. 2026, 08:04 PM 👁 50
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల్లో ఖరీఫ్ పంట దిగుబడులు, పత్తి కొనుగోళ్లు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఖరీఫ్ పంట దిగుబడులు, పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని శుభ్రపరచి, 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలని సూచించారు.

వరి ధాన్య సేకరణ కోసం జిల్లాలో ఇప్పటివరకు ఐకేపీ ఆద్వర్యంలో 115, పీఏసీఎస్ ఆద్వర్యంలో 108, మెప్మా ఆద్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, అలాగే 26 రైస్ మిల్లులు, ప్రభుత్వ ప్రత్యామ్నాయ గోదాములు సిద్ధంగా పెట్టామని పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపు నిచ్చారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధంగా పెట్టాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.

సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, పౌర సరఫరాల శాఖ అధికారి తనూజా, మేనేజర్ గోపాల్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App