🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గూడెం మండలంలో ఐదు పంచాయతీలకు కూటమి అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. జనసేన మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు పిలుపు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 12:22 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెం మండలంలోని ఐదు గ్రామపంచాయతీలకు కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు ప్రకటించారు. సంకడా నుంచి ఉల్లం ఈశ్వరరావు, రింతాడ నుంచి కొయ్యం ఇమ్మానుయేల్ సిద్దు, వంచుల నుంచి పాంగి శ్రీను, సీలేరు నుంచి వంతల దీనమణి, జర్రెల నుంచి కొంతులంగి సంధ్య పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బాలరాజు పిలుపునిచ్చారు. ఐకమత్యంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.
📲Get App