🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కూటమి గెలుపునకు రెబల్స్ రూపంలో రాజకీయ గండం! పార్టీ అభ్యర్థుల మధ్య పోటీతో కార్యకర్తల్లో గందరగోళం.. అధిష్టానం వెంటనే స్పందించాలి: రీమల రాజేశ్వరి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 08:07 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూటమి పార్టీలకు రెబల్ అభ్యర్థుల పోటీ పెద్ద సవాలుగా మారిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రీమల రాజేశ్వరి అన్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడటమే కాకుండా ఎన్నికల్లో విజయావకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.గత ఎంపీటీసీ ఎన్నికల్లో సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బీ-ఫామ్‌లు కేటాయించడం వల్ల పలుచోట్ల రెబల్ అభ్యర్థులు పోటీలో నిలిచి కూటమి ఓటమికి కారణమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం జీకే వీధి మండల పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.ఒకే పంచాయతీలో పలువురు కూటమి మద్దతుదారులు పోటీలో ఉండటంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక క్షేత్రస్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు.కూటమి అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని రెబల్ అభ్యర్థుల సమస్యకు పరిష్కారం చూపాలి. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, గెలుపు అవకాశాలున్న అధికారిక అభ్యర్థులకు మద్దతు కల్పించాలని రీమల రాజేశ్వరి కోరారు.
📲Get App