🔥 TRENDING बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం లో కడుపునొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య...

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 19 Nov 2026, 10:29 AM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం, నవంబర్ 18: NEED 24NEWS

దీర్ఘకాలంగా వేధిస్తున్న కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పిచ్చి భోజ్య తండా (పడమటి తండా) గ్రామానికి చెందిన భూక్యా బాలు (75) గత ఐదేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలుమార్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో కడుపునొప్పితో బాధపడు తున్న తండ్రికి కుమారుడు భూక్యా రవి మందులు ఇచ్చి, భార్య రంగమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతకగా.. ఇంటి వెనుక ఉన్న పెద్ద తంగేడు చెట్టుకు రుమాలుతో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుమారుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మృతిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దవంగర ఎస్పై ప్రమోద్ కుమార్ తెలిపారు..
📲Get App