🔥 TRENDING રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వైసీపీ శ్రేణుల్లో ఐక్యతకు నేతల కృషి.. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుతో జీకే వీధి నాయకుల భేటీ దామనపల్లి పంచాయతీ నేతలతో రాజకీయ అంశాలపై చర్చ

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 07:42 AM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా స్థానిక నాయకులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జీకే వీధి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వంతల చంటి బాబు ఆధ్వర్యంలో దామనపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు బుధవారం పాడేరులో ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు పంచాయతీ పరిధిలోని సమస్యలు, ప్రజల అవసరాలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయడంపై చర్చించారు.ఈ భేటీలో దామనపల్లి పంచాయతీ వైసీపీ ప్రధాన కార్యదర్శి తగ్గి ఈశ్వరరావు, కార్యదర్శి సాగిన వీరన్న పడాల్, కొర్రా గోవిందరావు, వంతల రాజ్‌కుమార్‌తో పాటు క్రిస్టియన్ విభాగం ప్రతినిధులు, పాస్టర్లు పాంగి సుబ్బరావు, కొర్రా విక్టర్ బాబు, గెమ్మెల మోహన్ రావు, కొర్ర ఈశ్వర్, చెదల చిట్టిబాబు, మర్రి అప్పారావు, సాగిన జోగిపడాల్, సీందేరి రాజు, మర్రి రవి, జాన్, ప్రసాద్, చిన్నబ్బాయి, చంటి, మహేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
📲Get App