🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం . -అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 19 Nov 2026, 06:34 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం .
-అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం: నవంబర్ 18:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దవంగర మండల తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్ కోరారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని తెలిపారు. ఈ పథకాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 19 వరకు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని, రేషన్ కార్డు ఉన్నవారితోపాటు రేషన్ కార్డు లేని వారు కూడా ప్రభుత్వం నిర్దేశించిన అర్హత నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు..
📲Get App