🔥 TRENDING સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt... Manipur High Court Declares Producing...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గూడెం కొత్తవీధి ఎంపీపీగా పూజారి లీలా ప్రసాద్ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా బాకూరు రాజేశ్వరి మండల అభివృద్ధి, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 04:18 PM 👁 232
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పూజారి లీలా ప్రసాద్, ఉపాధ్యక్షురాలిగా బాకూరు రాజేశ్వరి ఎన్నికయ్యారు. మండల పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించిన వీరిద్దరికి మండల పరిషత్ పాలకవర్గంలో కీలక బాధ్యతలు దక్కాయి.ఈ సందర్భంగా నూతన ఎంపీపీ పూజారి లీలా ప్రసాద్, వైస్ ఎంపీపీ బాకూరు రాజేశ్వరి మాట్లాడుతూ తమపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, మద్దతు తెలిపిన ఎంపీటీసీ సభ్యులకు, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గూడెం కొత్తవీధి మండల సమగ్రాభివృద్ధికి, గిరిజన ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.నూతన పాలకవర్గానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.
📲Get App