🔥 TRENDING Atul Kumar Rajasthan United eye back-to-back wins... Hisar-Jodhpur Express Resumes Operatio... Drone discovered in residential area n... କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... Rajasthan Power Corp to Conduct JE Rec...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దాబా (కే)లో నిరుపయోగంగా వైకుంఠధామం.. నేటికీ జరగని అంత్యక్రియలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 17 Nov 2026, 10:10 AM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: మండలంలోని దాబా (కే) గ్రామానికి దూరంగా నిర్మించిన వైకుంఠధామం నేటికీ నిరుపయోగంగా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క అంత్యక్రియ కూడా నిర్వహించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి దూరంగా ఉండటంతో పాటు విద్యుత్, నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైకుంఠధామం పూర్తిగా గడ్డి, పిచ్చి మొక్కలతో నిండిపోయి అధ్వానంగా కనిపిస్తోంది. ప్రజాధనం ఖర్చు చేసినా ప్రజలకు ఉపయోగపడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వైకుంఠధామంలో మౌలిక సదుపాయాలు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
📲Get App