🔥 TRENDING રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దామనపల్లి సర్పంచ్ పోరులో వంతల కాసులమ్మ చంటిబాబు.. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి! అభిమానులు, కార్యకర్తల భారీ ర్యాలీ మధ్య నామినేషన్ సమర్పణ

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 17 Nov 2026, 05:07 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల వేడి ఊపందుకుంది. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన వంతల కాసులమ్మ చంటిబాబు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు.ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా మహిళలు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో సందడి చేశారు. ఉద్యోగ జీవితాన్ని పక్కనపెట్టి ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలోకి దిగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మద్దతుదారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వంతల అరుణ్ కుమార్, రీమల బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మువ్వల చిన్నబ్బాయి, సోషల్ మీడియా అధ్యక్షులు పాతూను లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే తగ్గి ఈశ్వరరావు, సాగిన వీరన్న పడల్, కొర్ర గోవింద్ రావు, పాంగి సుబ్బారావు, కొర్ర విక్టర్ బాబు, గెమ్మెల మోహన్ రావు, కొర్ర అజయ్, కొర్ర ఈశ్వర్, అకూసింగి రాజు తదితర నాయకులు హాజరయ్యారు.స్థానిక నాయకులు చిన్నబ్బాయి, చంటి, బాబి, బుజ్జిబాబు, చెర్రికి రామారావు, కిల్లో రాము, సుర్ల పండయ్య, మహేష్, సైమన్, రాంబాబు, నాగేశ్వరరావుతో పాటు పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App