🔥 TRENDING बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కూటమి అభ్యర్థి నారాయణమ్మకు నేతల అండదండలు.. గెలుపే లక్ష్యంగా మద్దతు వెల్లువ!

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 07:47 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి కంకిపాటి నారాయణమ్మకు మద్దతుగా టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు ముందుకొచ్చాయి. ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల్లో విజయాన్ని అందించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో నిలిచిన నారాయణమ్మ గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కూటమి నాయకులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల ఆత్మగౌరవం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో ఆమె ముందుకు సాగుతున్నారని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో నారాయణమ్మను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కూటమి నాయకులు, కార్యకర్తలు కోరారు.
📲Get App