🔥 TRENDING आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग... କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો... कार्तिक मेले में श्रद्धालुओं से Need 2...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దొడ్డికొండ సర్పంచ్ ఎన్నికలపై వైసీపీ నేత వంతల చంటిబాబు దృష్టి.. భార్యను బరిలో దింపేందుకు కసరత్తు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 08:22 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలవడంతో రాజకీయ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబు దొడ్డికొండ పంచాయతీలో రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించారు. తన సతీమణిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించాలనే ఆలోచనతో గ్రామ పెద్దలు, యువతతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించి, ఎన్నికల్లో అందరూ సహకరించాలని కోరారు. దీనికి గ్రామ పెద్దలు, యువత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం తమకు మద్దతు ఇస్తుందనే ఆశాభావాన్ని చంటిబాబు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దామనాపల్లి పంచాయతీ రాజకీయ పరిణామాలపై కూడా స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మండలంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
📲Get App