🔥 TRENDING ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గూడెంకొత్తవీధి సర్పంచ్ బరిలో పసుపులేటి నాగమణి.. వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్లు! గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 06:34 PM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెంకొత్తవీధి మండల కేంద్ర గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థిగా పసుపులేటి నాగమణి ఎన్నికల బరిలో నిలవగా, ఆమెకు మద్దతుగా వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలోని వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న నాడేల సత్యారావు, జర్తా భాస్కరరావు ఆదివారం తమ నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.సర్పంచ్ అభ్యర్థి పసుపులేటి నాగమణి మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు అభ్యర్థులు తెలిపారు.
📲Get App