🔥 ट्रेंडिंग Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... अमेरिकी कंपनियों ने भारत में डिज़ाइन व... अहमदाबाद में तीसरा ऑल इंडिया पुलिस बैड... कर्नाटक बनाम झारखंड: 20 नवंबर 2026 का...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ లో బాలల హక్కులు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక బాలల గ్రామసభ

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 14 नव. 2026, 01:17 PM 👁 60
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరికొండ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రత్యేక బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొడ్డు దత్తాత్రి మాట్లాడుతూ.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. గ్రామసభలో బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, విద్యార్థుల సమస్యలు, పాఠశాల అభివృద్ధి, బాలల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ వారి హక్కులు, భవిష్యత్తు పట్ల సమాజం బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్, ఉపాధ్యాయులు సుధారాణి, ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాష్, వార్డు సభ్యులు రామారావు, ముక్రం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
📲Get App