🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దేవరాపల్లిలో వైఎస్సార్‌సీపీకి కొత్త ఊపు.. కూటమి నేత చేరికతో పెరిగిన రాజకీయ బలం! సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతల వ్యూహాలు.. ఐక్యతతో విజయానికి కృషి చేయాలని పిలుపు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 10 Nov 2026, 07:09 PM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
దేవరాపల్లి పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత బలోపేతం అవుతోంది. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ శ్రేణులు, రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు కార్యాచరణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించారు.ఈ సందర్భంగా పంచాయతీ పార్టీ అధ్యక్షుడు కుమ్మరి రామలింగం మాట్లాడుతూ, ఎంపీటీసీ అభ్యర్థి జర్తా వరలక్ష్మి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలంతా ఐక్యంగా ఉంటూ పార్టీ బలపరిచే మహిళా అభ్యర్థిని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీలోకి కూటమి నేత

సమావేశంలో కూటమికి చెందిన సీనియర్ కార్యవర్గ సభ్యుడు సాగిన లక్ష్మణరావు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ నాయకులు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో దేవరాపల్లి పంచాయతీలో పార్టీకి మరింత రాజకీయ బలం చేకూరుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు దేవరాజు రామచంద్రరావు, దేవరాజు పద్మ, మాజీ ఎంపీటీసీ పోతురాజు కృష్ణమూర్తి, పార్టీ కార్యదర్శి ఆరుగుల రామారావు, కొర్ర సతీష్, ఉలం వెంకటేశ్వర్లు, పాంగి కృష్ణబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App