🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఏజెన్సీ అభివృద్ధికి స్థానిక నాయకత్వమే కీలకం.. జెడ్పీ పీఠం చింతపల్లి, జీకే వీధికి ఇవ్వాలి! రాజకీయ పార్టీల అధిష్టానాలకు క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్ల సేవా సంఘం విజ్ఞప్తి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 10 Nov 2026, 07:02 PM 👁 78
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చింతపల్లి లేదా గూడెంకొత్తవీధి ప్రాంతానికి చెందిన నాయకులకు కేటాయించాలని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్ల సేవా సంఘం ప్రతినిధులు రాజకీయ పార్టీల అధిష్టానాలను కోరారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి అత్యున్నత బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, చింతపల్లి, జీకే వీధి ప్రాంతాలు ఇప్పటికీ అనేక మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోవడం, అత్యవసర వైద్య సేవలకు డోలీలపై ఆధారపడాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు.గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయడంతో పాటు, స్థానిక ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించగల నాయకుడికి జెడ్పీ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. చింతపల్లి, జీకే వీధి ప్రాంతాలకు ఈ అవకాశం కల్పిస్తే వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని అభిప్రాయపడ్డారు.ఈ మేరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రాజకీయ పార్టీల నాయకత్వాలు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్ల సేవా సంఘం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
📲Get App