🔥 TRENDING కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆర్వినగర్‌లో స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు ఇంటింటా ప్రచారం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 02 Nov 2026, 08:53 PM 👁 102
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీకే వీధి 3 ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు సోమవారం ఆర్వినగర్ ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక ఓటర్లను నేరుగా కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకుంటూ మద్దతు కోరారు. బ్యాలెట్ పేపర్‌లో ఎయిర్ కండిషనర్ గుర్తును గుర్తించి ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నవంబర్ 5న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
📲Get App