🔥 TRENDING उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

తుఫాన్ వేళ అప్రమత్తత.. దుచ్చరపాలెంలో రోడ్డుపై పడిన చెట్టు తొలగింపు ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి: జీకే వీధి ఎస్‌ఐ సురేష్

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 28 Oct 2026, 05:43 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దుచ్చరపాలెం ప్రాంతంలో రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై స్పందించిన జీకే వీధి ఎస్‌ఐ సురేష్ చొరవతో చెట్టును తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు విరిగి రహదారులపై పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప తుఫాన్ సమయంలో ప్రయాణాలను తగ్గించుకోవాలని, బలమైన గాలులు వీచేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని తెలిపారు.
రోడ్లపై చెట్లు లేదా ఇతర అడ్డంకులు కనిపిస్తే వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని జీకే వీధి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
📲Get App