🔥 TRENDING ঢাক-ঢোলের তালে জমজমাট বেলডাঙার ঐতিহ্যব... Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

పైడిపర్రులో పిచ్చికుక్క దాడి: మహిళకు తీవ్ర గాయాలు

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 11 Oct 2026, 07:48 PM 👁 72
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

తణుకు మండలం పైడిపర్రు జగనన్న కాలనీలో పిచ్చికుక్క దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో మరొక వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

తణుకు మండలం పైడిపర్రులోని జగనన్న కాలనీలో ఆదివారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఉన్నమట్ల భవాని అనే మహిళపై కుక్క దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

భవానిని కాపాడేందుకు ప్రయత్నించిన నాని అనే వ్యక్తిపైనా కుక్క దాడి చేసింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన ఉన్నమట్ల భవానిని కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
📲Get App