🔥 TRENDING ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
పసలపూడిలో పులి సంచారం: రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సీఐ హెచ్చరిక
Local

పసలపూడిలో పులి సంచారం: రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సీఐ హెచ్చరిక

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 10 Oct 2026, 03:10 AM 👁 99
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ఉండ్రాజవరం మండలం పసలపూడి వద్ద పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని తణుకు రూరల్ సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు.

ఉండ్రాజవరం మండలం పసలపూడి వద్ద పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పులి ఎటువైపు వెళుతుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని తణుకు రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

తణుకు మండలం ముద్దాపురం, కోనాల తదితర ప్రాంతాల్లో తణుకు రూరల్ పోలీసులు పర్యటించి, అటవీ ప్రాంతాలకు వెళ్లే రైతులను అప్రమత్తం చేస్తున్నారు. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా అటవీ అధికారులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. పులి సంచారంపై అధికారులు నిఘా ఉంచారు.
📲Get App