🔥 TRENDING कोंच की रामकुण्ड कॉलोनी में श्रीमद्भाग... सड़क सुरक्षा पखवाड़ा: मोबाइल पर बात कर... Kerala Murder Accused Returned to Indi... Man Linked to Bishnoi Gang Wanted in 2... Assam Road Accident Claims Lives of Tw... Gadkari Urges Zero-Accident Roads Acro...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆటో స్టాండ్ నూతన అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక...
National

ఆటో స్టాండ్ నూతన అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక...

✍️ Reporter: Niranjan Vengalathuru 🗓 02 Oct 2026, 03:18 PM 👁 305
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆటో స్టాండ్ నూతన అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక...

రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఆటో స్టాండ్ కు సంబంధించిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు కలసి శుక్రవారం శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు, డిసిసిబి మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 83 మంది ఆటో ఓనర్లు, డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు మహేష్ బాబు,అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షుడు రాముడు, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం తో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆటో ఓనర్లు, డ్రైవర్ల సమస్వలను పరిష్కరించేందుకు నూతన అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. అందరి సహకారంతో అందరికీ ఆదర్శంగా, పారదర్శకంగా అసోసియేషన్ ను ముందుకు తీసుకొని వెళ్తామని అన్నారు. అనంతరం డిసిసిబి మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో ఓనర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.
📲Get App