🔥 TRENDING 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

HYDలో సైబర్ మోసాల బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక సేవలు

✍️ Reporter: Kranthi Kumar 🗓 16 Nov 2026, 01:27 PM 👁 85
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్‌లో సైబర్ మోసాలకు గురైన బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మోసానికి గురైన తర్వాత నగదును తిరిగి ఇప్పించేందుకు MRM విధానాలు, ఫ్రీజ్ ఖాతాల సమస్యల పరిష్కారానికి GRM విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యూరో అందించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 81,170 మంది బాధితులకు రూ.58.25 కోట్ల మేర రిఫండ్ చేయగలిగింది. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులకు వేగంగా మార్గనిర్దేశం చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ చర్యలు అమలవుతున్నాయి. హైదరాబాద్‌లో సైబర్ నేరాల బాధితులు అధికంగా ఉన్నట్లు పేర్కొంటూ, మోసానికి సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు. రికవరీ ప్రక్రియలో సరైన విధానాలు పాటించడం కీలకమని కూడా చెబుతున్నారు. సైబర్ మోసాల బారిన పడ్డవారు 8712665600 లేదా 1930 హెల్ప్ లైన్లను సంప్రదించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది.
📲Get App