🔥 TRENDING Meghalaya CM unveils plan to transform... Meghalaya CM Orders Probe into Ropeway... Aerotropolis land‑pooling application... Smart Traffic Signals Worth ₹2.4 milli... Armed Robbery Attempt in Mohali Leaves... Court Rules Recording Statements After...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

తణుకు మండలంలో వరద నీటిలో 3,000 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనం

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 11 Nov 2026, 04:24 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

పది రోజుల వరద ముంపులో వరి పొలాలు మగ్గి, రైతులు 3,000 ఎకరాల పంట నష్టాన్ని ఆవేదన వ్యక్తం చేశారు.

తణుకు మండలంలో దువ్వ గ్రామ పరిధిలోని వరి పొలాలు గత పది రోజులుగా వరద నీటిలో మగ్గుతున్నాయి.

వయ్యేరు వరద ఉధృతితో సుమారు 3,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయామని, పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

రైతులు ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరారు.
📲Get App