🔥 ट्रेंडिंग अनुष्का शेट्टी ने हैदराबाद घर बेचा, टो... तेलुगु फिल्मों से स्रीलीला की अनुपस्थि... डेमोक्रेटिक सांसदों ने इरान युद्ध प्रत... सरकार ने एंटीमाइक्रोबियल निगरानी के लि... त्रिपुरा के जल एवं पूर्वी मंत्री ने कै... हिमाचल प्रदेश में साईबेरियन प्रवासी पक...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మర్రిపాకలు రోడ్డు నిర్మాణంతో నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర.. 30 గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి: ముక్కల మహేష్

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 18 नव. 2026, 07:34 AM 👁 50
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం యూజీడీ పాలెం పంచాయతీ పరిధిలోని మర్రిపాకలు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో సుమారు 30 గ్రామాల ప్రజల చిరకాల నిరీక్షణకు తెరపడనుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రానుండటంతో గిరిజన గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని మాజీ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కల మహేష్ తెలిపారు.చిన్న అగ్రహారం నుంచి మర్రిపాకలు మీదుగా నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు నిత్యావసరాలు, వైద్యం, విద్య తదితర అవసరాల కోసం రాకపోకలు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు.ఈ రహదారి సాధన కోసం అల్లూరి సీతారామరాజు యువజన రైతు మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా నిరంతర పోరాటం సాగించామని ఆయన గుర్తుచేశారు. సంఘం చేసిన కృషి, పట్టుదల ఫలితంగానే నేడు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన పాత్రికేయులందరికీ ముక్కలి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న సుమారు 30 గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
📲Get App