🔥 TRENDING સુરત જિલ્લાની વકીલ મંડળની ચૂંટણી ડ્રાફ... अरावली के पहाड़-चट्टान को कैनवास पर उत... डिवाइडर से टकराई तेज रफ्तार कार, एक की... સુરતમાં સહારા દરવાજા વિસ્તારમાં સિટી બ... 400 करोड़ की स्क्रिप चोरी में एक आरोपी... लखनऊ में लगन‑सगाई समारोह में 15 लाख की...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం మూడు విడతల్లో 244 పంచాయతీలు, 2,446 వార్డులకు పోలింగ్

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 10:09 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు విడతల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఐఏఎస్ వెల్లడించారు.మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని జిల్లాలో ఎన్నికల సన్నద్ధతను వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతతో పాటు ఎన్నికల సామగ్రి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు.
ఈ నెల 26న మొదటి విడతలో చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి మండలాల్లో 66 పంచాయతీలు, 686 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 29న రెండో విడతలో పెదబయలు, ముంచింగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో 87 పంచాయతీలు, 880 వార్డులకు, డిసెంబర్ 2న మూడో విడతలో పాడేరు, అరకులోయ, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో 91 పంచాయతీలు, 880 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.మొదటి విడతలో కొయ్యూరు మండలానికి చెందిన ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా, వివిధ పంచాయతీల్లో 132 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు జిల్లా పంచాయతీ అధికారి కె.పి. చంద్రశేఖర్ వెల్లడించారు. మిగిలిన స్థానాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తూ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
📲Get App