🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పార్టీ తీరుపై అసంతృప్తి.. ఎంపీటీసీ పదవికి లక్ష్మణరావు గుడ్‌బై! రూ.15 లక్షల వ్యవహారంపై వివాదం.. న్యాయం చేయాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 08:35 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి మండల రాజకీయాల్లో ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణరావు చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను గెలిచిన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.2011 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీ-ఫామ్ కేటాయింపు సమయంలో తన వద్ద రూ.15 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుల కోసం భార్య పేరుతో రుణం తీసుకోవడంతో పాటు కుటుంబ బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. తనకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించి న్యాయం చేయాలని పార్టీ పెద్దలను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. అయితే, బొబ్బిలి లక్ష్మణరావు చేసిన ఆరోపణలపై సంబంధిత నాయకుల వివరణ రావాల్సి ఉంది.
📲Get App