🔥 TRENDING Pakistan Minister to Visit India for S... Foreign Policy Publishes Questioning A... Panchayat Season 5 Set to Launch: Wher... Bhojpuri Star Khesari Lal Yadav Says H... Prime Video to Stream 'Vvaan', a Fanta... The Times of India Releases Official T...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గూడెంకొత్తవీధి సర్పంచ్ స్థానానికి గెమ్మెల త్రినాధ్ పోటీ.. కూటమి శ్రేణుల సమక్షంలో నామినేషన్! 15 ఏళ్ల బీజేపీ రాజకీయ ప్రస్థానం.. ఐదేళ్లు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 17 Nov 2026, 06:09 PM 👁 80
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి తరఫున గెమ్మెల త్రినాధ్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్నికల కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన త్రినాధ్ గత 15 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఐదేళ్లపాటు గూడెం మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నూకదొర సామాజిక వర్గానికి చెందిన ఆయన సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగడంతో స్థానికంగా రాజకీయ చర్చ మొదలైంది.నామినేషన్ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా త్రినాధ్ బరిలో నిలవడంతో గూడెంకొత్తవీధి పంచాయతీ ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
📲Get App